Home  »  TV News  »  చిలిపి గొడవలతో మరింత దగ్గర అవుతున్న రిషి, వసుధార!

Updated : Feb 9, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ ఎపిసోడ్ -682 లోకి అడుగుపెట్టింది. కాగా గురువారం రోజు జరిగిన ఎపిసోడ్ లో.. ప్రాజెక్ట్ పని మీద రిషి, వసుధారలు బయటికి రాగా మధ్యలో కార్ ఆపి టీ తాగుతారు. ఇలా నీతో కలిసి టీ తాగుతుంటే బాగుందని వసుధారని ఉద్దేశించి మనసులో అనుకుంటాడు. ఇక వాళ్ళు వెళ్ళవలిసిన వీలేజ్ కి చేరుకొని, మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి అక్కడున్న పిల్లలకు, తల్లిదండ్రులకు వివరిస్తారు. కిట్స్ ఇచ్చి బయలుదేరుతుండగా అక్కడున్న ధర్మయ్య అనే వ్యక్తి వాళ్ళిద్దరిని ఆపి.. "సర్ మా పిల్లలకు, ఇక్కడున్న వాళ్ళకి ఇంత సహాయం చేస్తున్నారు. మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి" అని అంటాడు. లేదండి మీకెందుకు శ్రమ అని రిషి అనగా.. "మేము తినేదే మీకు పెడతాం సర్ రండి" అని అతను అంటాడు. సరే  అంటాడు రిషి.. వసుధార బ్యాగ్ లోంచి చాక్లెట్ తీసి.. సర్ చాక్లెట్ తిందామా ఒక్కటే ఉంది సర్ అని అంటుంది. గతంలో వసుధార ఎంగిలి చేసి రిషికి ఇచ్చింది గుర్తు చేసుకొని.. తన చేతిలో నుండి ఆ చాక్కెట్ తీసుకుంటాడు. రిషి సగం తినేసి ఇస్తాడేమో అని వసుధార ఎదురుచూస్తుంది. కానీ రిషి అలా చెయ్యకుండా మొత్తం చాక్లెట్ తినేస్తాడు. వసుధార అలానే ఆశ్చర్యపోయి చూస్తుంది.


రిషి, వసుధారలు ధర్మయ్య ఇంటికి వెళ్ళగానే భోజనానికి అన్ని సిద్ధం చేస్తారు. ఇద్దరు కలిసి భోజనం చేస్తుండగా.. "సర్ మీరు మా ఇంటికి రావడం సంతోషంగా ఉంది" అని ధర్మయ్య అంటాడు. అవును కొత్త దంపతులు చిలక గోరింకల్లా ఉన్నారని ధర్మయ్య భార్య అంటుంది. అది విన్న రిషి మనసులో సంతోషంగా ఫీల్ అవుతాడు. వాళ్ళిద్దరు అక్కడ ఉన్నంత సేపు భార్య భర్తలు అన్నట్లుగా ధర్మయ్య దంపతులు మాట్లాడుతారు‌. హస్బెండ్ అండ్ వైఫ్ కాదని నువ్వు చెప్పొచ్చు కదా అని వసుధారని రిషి అంటాడు. మీరే చెప్పొచ్చు కదా అని రిషిని వసుధార అంటుంది. భోజనం చేసిన తర్వాత ఇద్దరు బయటకొచ్చి అక్కడ నుండి వెళ్తుంటారు. "మళ్ళీ వచ్చే సంవత్సరానికి పాపతోనో బాబుతోనో కలిపి రావాలి" అని ధర్మయ్య దంపతులు అంటుంటే..  సిగ్గు పడుతుంది వసుధార. వెళ్ళొస్తాం అని చెప్పేసి ఇద్దరు బయలుదేరుతారు. మళ్ళీ మొదలవుతుంది కోల్డ్ వార్. వసుధార కార్లో నిద్రపోతుంటే తను పడుకుంది. నేనేమైనా డ్రైవర్ అనుకుంటుందా అని కార్ ని మలుపులు తిప్పుతు బ్రేక్ వేస్తాడు. వసుధార ఒక్కసారిగా కళ్లు తెరిచి.. "ఏంటీ సర్ ఈ డ్రైవింగ్" అని అంటుంది. "హా ఏంటి.. పోనీ నువ్వు నడుపు నేను పడుకుంటాను" అని రిషి వెటకారంగా అంటాడు.

ఇంతలో వసుధారకి మినిస్టర్ గారు ఫోన్ చేసి రమ్మంటాడు. ఇద్దరు మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే వసుధార నీకు పెళ్లి అయిందని విన్నాను. నా తరుపున ఈ చిన్న కానుక అని ఇస్తాడు.  మినిస్టర్ గారు ఒక వైపు.. రిషి ఒక వైపు అలా ఇద్దరి చేతుల మీదుగా వసుధారకి గిఫ్ట్ ఇస్తారు. చాలా థాంక్స్ సర్ అంటుంది వసుధార. మీ హస్బెండ్ ఏం చేస్తారని మినిస్టర్ అడుగగా... నా హస్బెండ్ ఆల్ రౌండర్ అని చెప్తుంది. ఒకసారి మా ఇంటికి భోజనానికి నువ్వు నీ భర్త కలిసి రావాలని మినిస్టర్ గారు అనగానే.. సరే సార్ రిషి సర్ ని కూడా తీసుకొస్తా అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.